రాజధానిలో ఇప్పటికే 5 వేల ఇళ్లు
ABN , First Publish Date - 2020-09-09T10:09:34+05:30 IST
పేద ప్రజలు ఉండటానికి వీల్లేని అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండటానికి వీల్లేదంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై రాజధాని రైతులు,
- వాటిని పేదలకు ఇవ్వకుండా తాత్సారం
- ఇప్పుడు ఎక్కడి వారికో ఇక్కడ ఇస్తామంటారా?
- ముందు ఇక్కడి వాటిని పేదలకు ఇవ్వాలి
- అమరావతిని మరో ‘ధారావి’గా మార్చొద్దు
- రాజధాని రైతులు, మహిళల డిమాండ్
- సీఆర్‌డీఏ చట్టాన్ని గౌరవించాలని హితవు
- మంత్రి కొడాలి వ్యాఖ్యలపై జేఏసీ తీవ్ర అభ్యంతరం
- 266వ రోజు కొనసాగిన రాజధాని ఉద్యమం
విజయవాడ/గుంటూరు,సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): పేద ప్రజలు ఉండటానికి వీల్లేని అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండటానికి వీల్లేదంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై రాజధాని రైతులు, అమరావతి జేఏసీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనరాహిత్యాన్ని బయటపెడుతున్నాయని అమరావతి జేఏసీ నాయకులు డాక్టర్ కె.శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మందడం, వెంకటపాలెం ప్రాంతాల్లో అమరావతిలోని ఇళ్లులేని పే దలకు సుమారు 5వేల ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు నిర్ణయించింద ని, నిర్మాణం తుది దశలో ఉన్న వీటిని పూర్తిచేసి లబ్ధిదారులకు ఇ వ్వకుండా ఎక్కడో ఉన్న పేదలకు అమరావతిలో సెంటు స్థలం చొ ప్పున కేటాయిస్తామనడం ప్రభుత్వం చేతకానితనానికి ని దర్శనమ ని శ్రీనివాస్ పేర్కొన్నారు. అమరావతిలో 55 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానిపై కూడా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని మంత్రి నాని విమర్శిస్తున్నారని, సీఆర్డీయే చట్టాలను గౌరవించకుండా తమ ఇష్టమొచ్చిన ట్లు ప్రభుత్వాన్ని నడుపుతామంటే కోర్టులు చూస్తూ ఊరుకోవని స్పష్టం చేశారు.
‘కొడాలి’ దుష్టశక్తి: జేఏసీ
పేద ప్రజలు ఉండటానికి వీల్లేని అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండటానికి వీల్లేదంటూ.. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తుంటే అమరావతి జేఏసీ అడ్డుకుంటోందంటూ.. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు జేఏసీ కన్వీనర్ పి.మల్లికార్జునరావు తెలిపారు. రాజధానిలో ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లు ఇస్తామంటే అభ్యంతరం లేదన్నారు. ‘రాజధాని రైతులకు ఇస్తానన్న ప్యాకేజీ ఇవ్వండి. సీఆర్డీయే చట్టాన్ని గౌరవించండి’ అని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్ర ప్రజలకు ప్రతిష్ఠాత్మకంగా నిలవాల్సిన అమరావతిని ముంబైలోని ‘ధారావి’గా మార్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు ఉందని విమర్శించారు. మహిళా జేఏసీ నాయకురాలు డాక్టర్ శైలజ మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నాని ప్రజలతో ఛీ కొట్టించుకునేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి ప్రాంతానికి ఆయన దుష్టశక్తిగా మారారని విమర్శించారు. అమరావతి దళిత జేఏసీ నాయకుడు చిలకా బసవయ్య మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమంపై 266 రోజులుగా వైసీపీ నాయకులు నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.