5 వేల మరణాలు
ABN , First Publish Date - 2020-09-16T08:45:25+05:30 IST
రాష్ట్రంలో కరోనా మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. ఒకటితో మొదలైన కరోనా మరణాలు ఏకంగా ఐదు వేల మార్కును దాటేశాయి. కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలోనూ ఇన్ని మరణాలు సంభవించలేదు. మంగళవారం మరో 69 మంది

- రాష్ట్రంలో కరోనా మరణ మృదంగం
- ప్రతిరోజూ 70 మందికిపైగా బలి
- మంగళవారం 69 మంది మృతి
- మరణాల్లో దేశంలో నాలుగో స్థానం
- కొత్తగా 8,846 పాజిటివ్‌లు
- 5,83,925కి పెరిగిన బాధితులు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రంలో కరోనా మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. ఒకటితో మొదలైన కరోనా మరణాలు ఏకంగా ఐదు వేల మార్కును దాటేశాయి. కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలోనూ ఇన్ని మరణాలు సంభవించలేదు. మంగళవారం మరో 69 మంది కరోనాతో మరణించగా రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 5,014కి చేరుకుంది. జూన్ మొదటి వారం నుంచి కరోనా మరణాల సంఖ్య రెట్టింపయింది. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర (29,894), తమిళనాడు(8,434), కర్ణాటక(7,384) తర్వాత అత్యధిక మరణాలు ఏపీలోనే నమోదయ్యా యి. వాస్తవానికి ప్రభుత్వ లెక్కల్లో 5 వేల మరణాలే కనిపిస్తున్నా.. ఈ సంఖ్య మరో 2 వేలు ఎక్కువగా ఉండొచ్చని నిపుణుల అంచనా. గత 24 గంటల్లో రా ష్ట్రంలో 70 వేలకుపైగా శాంపిల్స్‌ను పరీక్షించగా 8,8 46 మందికి పాజిటివ్ నిర్ధారణైందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తూర్పుగోదావరిలో అత్యధికంగా.. 1,423, ప్రకాశంలో 979, పశ్చిమ గోదావరిలో 955, నెల్లూరులో 820 మందికి వైరస్ సోకింది. దీంతో బాధితుల సంఖ్య 5,83,925కి పెరిగింది. మంగళవారం మరో 9,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 4,86,531కి పెరిగింది. మంగళవారంప్రకాశంలో అత్యధికంగా 10 మంది చనిపోగా.. చి త్తూరులో 9, అనంతపురంలో 6, తూర్పుగోదావరిలో 6, కృష్ణాలో 6, కడపలో 5, విశాఖపట్నంలో 5, గుంటూరులో 4, నెల్లూరులో 4, విజయనగరంలో 4, పశ్చిమగోదావరిలో 4, కర్నూలు, శ్రీకాకుళంలో ముగ్గు రు చొప్పున కరోనాతో మరణించారు.
తూర్పులో 80 వేలకు చేరువ
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ అల్లకల్లో లం సృష్టిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 80 వేల మా ర్కుకి చేరుకుంది. మంగళవారం 1,423 మందికి వైర స్ సోకినట్టు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సం ఖ్య 79,643కి పెరిగింది. ప్రస్తుతం ఈ జిల్లాలో 11, 999 యాక్టివ్ కేసులున్నాయి. పశ్చిమ గోదావరిలో మరో 955 కేసులు నమోదయ్యాయి. కరోనాతో నలుగురు మరణించారు. చిత్తూరులో కొత్తగా 923 కేసు లు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి పాజిటివ్‌ల సంఖ్య 53,805కు చేరుకుంది. జిల్లాలో మరణాల సంఖ్య 543కి పెరిగింది. నెల్లూరులో కొత్తగా 520 పాజిటివ్‌లు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో మరో 474 కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి మొత్తం కేసులు 45,424 అయ్యాయి.
కరోనాతో ‘నేచర్ బాలరాజు’ మృతి
అరకులోయ: నేచర్ స్వచ్ఛంద సంస్థ సీఈవో ఎస్.బాలరాజు(51) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం కొవిడ్-19 బారిన పడిన ఆయన చికిత్స నిమి త్తం విశాఖపట్నం అపోలో ఆస్పత్రిలో చేరారు. పరిస్థి తి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని సంస్థ కో-ఆర్డినేటర్ సుభాష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెం దిన బాలరాజు సుమారు 3 దశాబ్దాల క్రితం విశాఖ ఏజెన్సీకి వలస వచ్చారు. అరకులోయ కేంద్రంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో నేచర్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఏపీ లో బాలల హక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. అమెరికాలోని పనామాలో ఉన్న స్వాహిలి యూనివర్శిటీ గత నెలలో బాలరాజుకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది.
రిటైర్ట్ టీచర్ ఆత్మహత్య!
ఇంట్లో అందరికీ కరోనా వైరస్ సోకడంతో ఆందోళనకు గురైన రిటైర్డ్ టీచర్.. తాను చికిత్స పొందుతున్న ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన జి.నరసింహమూర్తి(61) కుటుంబంలోని నలుగురికి కరో నా సోకింది. ఆయన చికిత్స నిమిత్తం ఈ నెల 7న విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. మనస్తాపానికి గురై సోమవారం రాత్రి ఆస్పత్రిలోని రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.