సైకిల్ కోసం దాచుకున్న డబ్బును.. విరాళంగా ఇచ్చిన నాలుగేళ్ల కుర్రాడు

ABN , First Publish Date - 2020-04-08T01:14:14+05:30 IST

కరోనా వైరస్(కోవిడ్-19)ను తరిమికొట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న పోరుకు ఓ నాలుగేళ్ల కుర్రాడు తన వొంతు సహాయాన్ని అందించి అందరికీ ఆదర్శం

సైకిల్ కోసం దాచుకున్న డబ్బును.. విరాళంగా ఇచ్చిన నాలుగేళ్ల కుర్రాడు

అమరావతి: కరోనా వైరస్(కోవిడ్-19)ను తరిమికొట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న పోరుకు ఓ నాలుగేళ్ల కుర్రాడు తన వొంతు సహాయాన్ని అందించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఎప్పటి నుంచో సైకిల్ కొనుక్కుదాం అని దాచుకున్న డబ్బును ఆ చిన్నారి ప్రభుత్వానికి విరాళంగా అందించాడు.


ప్రస్తుతం అంతా కరోనాను అరికట్టడం కోసం విరాళాలు ఇస్తున్నది చూసిన ఆ చిన్నారి.. తాను ఎంతో కొంత సహాయం చేయాలని భావించాడు. దీంతో అతను సైకిల్ కోసం దాచుకున్న రూ.971లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చాడు. వైసీపీ కార్యాలయంలో అతను ఈ డబ్బును రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి అందించాడు. 


చిన్నారి చేసిన పనిని మంత్రి అభినందించారు. అతను దేనికోసమైతే ఈ డబ్బును దాచాడో.. ఆ సైకిల్‌ని అతనికి త్వరలో బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర వైద్యశాఖ తాజా నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 4,421 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 117 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.

Updated Date - 2020-04-08T01:14:14+05:30 IST