పట్టిసీమ నుంచి 4,956 క్యూసెక్కుల నీటి విడుదల

ABN , First Publish Date - 2020-06-22T09:35:09+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి ఆదివారం 4,956 క్యూసెక్కుల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేసినట్లు పట్టిసీమ

పట్టిసీమ నుంచి 4,956 క్యూసెక్కుల నీటి విడుదల

పోలవరం, జూన్‌ 21: పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి ఆదివారం 4,956 క్యూసెక్కుల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పఽథకం డీఈ భాస్కరరామకృష్ణ తెలిపారు. గోదావరి నీటిమట్టం పెరగడం వల్ల మిగిలిన మోటార్లను ట్రయల్‌ రన్‌ చేయడానికి 14 మోటార్ల ద్వారా నీటి విడుదల చేసినట్లు తెలిపారు. గోదావరి నీటిమట్ట మరింత పెరిగితే 24 మోటార్ల ద్వారా నీటి విడుదల చేస్తామని తెలిపారు. 

Updated Date - 2020-06-22T09:35:09+05:30 IST