అనంతపురం: అంత్యక్రియలకు రూ.45 వేలు డిమాండ్

ABN , First Publish Date - 2020-07-27T19:48:17+05:30 IST

అనంతపురం: అనంతపురం మార్చురీలో శవం తరలింపునకు బేర సారాలు జరుగుతున్నాయి.

అనంతపురం: అంత్యక్రియలకు రూ.45 వేలు డిమాండ్

అనంతపురం: అనంతపురం మార్చురీలో శవం తరలింపునకు బేర సారాలు జరుగుతున్నాయి. నందమూరి నగర్‌కు చెందిన బొమ్మయ్య అనే వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో బొమ్మయ్య శవాన్ని తరలించేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. బొమ్మయ్య భార్య ఐదేళ్ల క్రితమే మృతి చెందింది. అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసేందుకు దాతలు ముందుకు వచ్చారు. అయితే మార్చురీ సిబ్బంది 60 వేలు డిమాండ్ చేస్తోంది. చివరకు 45 వేలు ఇస్తే అంత్యక్రియలు చేస్తాం లేదంటే మీరే చేసుకోండంటూ సమాధానమిస్తున్నారు. స్థానికులు అంత మొత్తం ఇచ్చుకోలేమని చెబుతున్నారు. దీంతో బొమ్మయ్య మృతదేహం మార్చురీలోనే ఉంది.Updated Date - 2020-07-27T19:48:17+05:30 IST