-
-
Home » Andhra Pradesh » 443 corona cases in the state
-
రాష్ట్రంలో మరో 443 కేసులు
ABN , First Publish Date - 2020-06-23T09:00:04+05:30 IST
రాష్ట్రంలో కరోనా వైరస్ జోరుకి అడ్డుకట్ట ప డడం లేదు. సోమవారం కొత్తగా 443 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిలో రాష్ట్రానికి చెందినవారు 392, ఇతర రాష్ట్రాల నుంచి

- విజయనగరం జిల్లా ఎమ్మెల్యేకు వైరస్
- 9,372కి పెరిగిన పాజిటివ్‌లు
- అనంతలో ఒక్కరోజే 70 కేసులు
- తూర్పు, పశ్చిమలోనూ ఉధృతి
- ఈనెల 16న అమెరికా నుంచి రాక
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రంలో కరోనా వైరస్ జోరుకి అడ్డుకట్ట ప డడం లేదు. సోమవారం కొత్తగా 443 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిలో రాష్ట్రానికి చెందినవారు 392, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 44, విదేశాల నుంచి వచ్చినవారు ఏడుగురు ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 16,704 శాంపిల్స్‌ను పరీక్షంచగా వాటిలో 443 పాజటివ్ వచ్చాయని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,372కి చేరుకుంది. తాజా కేసుల్లో అత్యధికంగా అనంతపురంలో 70 మందికి వైరస్ సోకగా.. తూర్పుగోదావరి (64), కర్నూలు(60), పశ్చిమగోదావరి(54) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 83 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం డిశ్చార్జిల సంఖ్య 4,435కి పెరిగింది. ఇక రాష్ట్రంలో తాజాగా ఐదు మరణాలు సంభవించగా మొత్తం మృతుల సంఖ్య 111కి ఎగబాకింది. కృష్ణా, కర్నూలు, అనంతపురం, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మవరణించారు.
అనంతపురం విలవిల
అనంతపురం జిల్లాలో ఒక్కరోజే 70 కేసులు వెలుగుచూశా యి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 870కి చేరుకుంది. కరోనా కారణంగా జిల్లాలో మరొకరు మృతిచెందగా.. మొత్తం మరణాలు ఏడుకి పెరిగాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 62 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కోనసీమలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ఆర్డీవో భవానీశంకర్ ప్రకటించారు. ప శ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారిగా కరోనా మృతి సంభవించింది. కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన భీమవరం వ్యక్తి సోమవారం మృతి చెందారు. గుంటూరు జిల్లాలో మరో 34 మందికి వైరస్ సోకగా.. మొత్తం బాధితులు 802కి చేరుకున్నారు. కృష్ణా జిల్లాలో కొత్తగా 15 పాజిటివ్ కేసులు బయటపడగా.. కరోనాతో మరొకరు చనిపోయినట్టు ధ్రువీకరించారు. వాస్తవానికి విజయవాడలోని కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయవాడ కార్పొరేటర్ అభ్యర్థితోపాటు ఐదుగురు క రోనా పాజిటివ్ బాధితులు ఆదివారం మరణించారు. అయితే ఒక్కరు మాత్రమే మరణించినట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు.
కర్నూలులో మరో 60 కేసులు
కర్నూలులో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒకే రోజు 60 కొత్త కేసులు వెలుగు చూశా యి. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సం ఖ్య 1354కు చేరింది. జిల్లాలో ఒకరు కొవిడ్ తో మృతి చెందగా.. మృతుల సంఖ్య 35కు చేరింది. కాగా నవనారసింహ క్షేత్రాల్లోని ఒక నరసింహస్వామి దేవాలయంలో పూజారికి కరోనా సోకడంతో అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయం తలుపులు మూసేవేశారు. నెల్లూరులో 12 పాజిటివ్ కే సులు నమోదయ్యాయి. సోమవారం ప్రభు త్వ జనరల్ ఆసుపత్రి నుంచి 33 మంది, నారాయణ ఆసుపత్రి నుంచి 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో బాధపడుతూ చెన్నైలో నెల్లూరు జిల్లా తడ వాసి మృతి చెందాడు. ఈ నెల 6న ఒకే ఇంట్లో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది.
ఆ ముగ్గురిలో 72 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండటంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. విజయనగరంలో కొత్తగా 21 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య 162కి చేరింది. విశాఖపట్నంలో ఒక్కరోజే 54 కేసులు నమోదయ్యాయి. అధికారికంగా 41 కేసులు ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో మరో 29 మందికి పాజిటివ్ వచ్చింది.
వైరస్‌తో పోరాడి.. బిడ్డతో ఇంటికి చేరి
శ్రీకాకుళం: కొద్ది రోజుల్లో ప్రసవిస్తుందనగా ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో పుట్టుబోయే బిడ్డను తలచుకుని కుటుంబసభ్యులంతా ఆందోళనకు గురయ్యారు. కానీ ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూనే పండం టి బిడ్డకు జన్మనిచ్చింది. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలానికి చెందిన దంపతులు ఉపాధి ప నుల కోసం హైదరాబాద్ వెళ్లారు. భార్య గర్భవతి కావడంతో స్వగ్రామం బయల్దేరదామని అనుకున్నా లాక్‌డౌన్ కారణంగా కుదరలేదు. ఆంక్షల సడలింపుతో జూన్ 1న స్వస్థలానికి చేరుకున్నారు. వారికి పరీక్షలు చేయగా.. ఆమెకు పాజిటివ్‌గా వచ్చింది. ప్రసవానికి సమయం దగ్గర పడడంతో వైద్య సిబ్బంది ఆమెను జాగ్రత్తగా చూసుకున్నారు. దీంతో ఆమె ఈ నెల 12న మగబిడ్డకు జన్మనిచ్చింది. చికిత్స అనంతరం తల్లీబిడ్డకు పలుమార్లు పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ వచ్చింది.