సీఎం జగన్ నివాసానికి అతి సమీపంలో 4 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-04T22:03:31+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది.

సీఎం జగన్ నివాసానికి అతి సమీపంలో 4 కరోనా కేసులు

గుంటూరు : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయే తప్ప కంట్రోల్ కావట్లేదు. తాజాగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి అతి సమీపంలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జగన్ నివాసానికి అతి సమీపంలో గల ఎన్టీఆర్ కట్ట, క్రిస్టియన్ పేటలో గురువారం 4 కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు.


కాగా.. సీఎం నివాస ప్రాంతం కావడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. ఇవాళ సాయంత్రం లోపు ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నాలుగు కేసుల్లో ఇద్దరు వాలంటీర్లు. ఆ ఇద్దరూ వాలంటీర్లు మూడు రోజుల క్రితం తాడేపల్లిలో పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. ఇద్దరు వాలెంటీర్లకు పాజీటివ్ రాకతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది.

Updated Date - 2020-06-04T22:03:31+05:30 IST