-
-
Home » Andhra Pradesh » 3833 member reached to Rayalaseema from other countries
-
విదేశాల నుంచి రాయలసీమకు 3833 మంది.. వీరిలో...
ABN , First Publish Date - 2020-03-23T17:05:15+05:30 IST
తిరుపతి: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో విదేశాలలో ఉన్న రాయలసీమ వాసులు ఇంటి బాట పట్టారు.

తిరుపతి: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో విదేశాలలో ఉన్న రాయలసీమ వాసులు ఇంటి బాట పట్టారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 3833 మంది రాయలసీమ జిల్లాలకు చేరుకున్నారు. వీరిలో ఉపాధి కోసం గల్ప్ దేశాలకు వెళ్లిన కడప జిల్లా వాసులు ఎక్కువగా ఉన్నారు. వారిలో ఆ జిల్లాకు చెందిన 2150 మంది స్వస్థలాలకు చేరుకున్నారు.
రాయలసీమ ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా ఇప్పటి వరకు నమోదు కాలేదు. విదేశాల నుంచి రాయలసీమ చేరుకున్న వారిలో ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారు.. 483 మంది.. వీరంతా 28 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేశారు. మరో 3,522 మంది వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఉన్నారు. పోలీసు శాఖ వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా నోటీసులు జారీ చేసింది. వారిపై నిరంతరం పర్యవేక్షణ, నిఘా ఉంచినట్టు పోలీసులు తెలిపారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల పరిధిలో విదేశాల నుంచి వచ్చిన వారిలో ప్లూ లక్షణాలతో 49 మంది కరోనా వార్డులలో చేరారు. వారిలో 46 మందికి నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. మరో మూడు అనుమానిత కరోనా కేసులు పరీక్షల దశలో ఉన్నాయి.