రహదారుల మరమ్మతులకు 350 కోట్లు
ABN , First Publish Date - 2020-11-26T09:09:13+05:30 IST
రోడ్ల బలిపై సర్కారు కళ్లు తెరిచింది! దెబ్బతిన్న రహదారుల అభివృద్ధికి రూ.350 కోట్లు విడుదల చేసేందుకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో భారీ వర్షాలకు రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి

అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రోడ్ల బలిపై సర్కారు కళ్లు తెరిచింది! దెబ్బతిన్న రహదారుల అభివృద్ధికి రూ.350 కోట్లు విడుదల చేసేందుకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో భారీ వర్షాలకు రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. మరమ్మతులు లేక భారీ గుంతలు ఏర్పడి మినీ కుంటలను తలపించేలా నోళ్లు తెరచి ప్రయాణికులను బలిగొంటున్నాయి. ఈ పరిణామంపై ‘రోడ్లు బలి’ శీర్షికన ఈ నెల 21న ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై సర్కారు స్పందించింది. సీఎంవో ఆదేశాల మేరకు అదనపు నిధులు ఇస్తున్నట్లు 21న ఆర్థికశాఖ ఆదేశాలిచ్చింది. ప్రత్యేక మరమ్మతులకు రూ.210 కోట్లు, సాధారణ మరమ్మతులకు రూ.140 కోట్లు కేటాయిస్తూ రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.