-
-
Home » Andhra Pradesh » 349 new corona cases new in AP
-
ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-12-27T23:50:34+05:30 IST
గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,81,061కు కరోనా కేసులు చేరాయి.

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,81,061కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 7,094 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 3,625 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,70,342 మంది రికవరీ అయ్యారు. కొత్తగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కేసుల సంఖ్య తగ్గిపోయింది. ఒకప్పుడు రోజుకు 10 వేల దాకా కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు వాటి సంఖ్య 500లోపు పడిపోయింది. కరోనా తగ్గిపోవడంతో జనం ఊపిరి పీల్చుకుని ఎవరి పనుల్లో వారు నిమగ్నమవుతున్నారు. వ్యాపార సంస్థలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఈ తరుణంలో బ్రిటన్‌లో కొత్త రకం స్ర్టెయిన వైరస్ ఉన్నట్లు వార్తలు రావడంతో జనాన్ని ఒక్కసారిగా కలవర పెడుతున్నాయి.