-
-
Home » Andhra Pradesh » 3380 NOMINATIONS FOR MUNICIPALITY POLLS
-
మున్సిపోల్స్‌కు 3380 నామినేషన్లు
ABN , First Publish Date - 2020-03-13T09:39:46+05:30 IST
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రెండోరోజు గురువారం వివిధ పార్టీల అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 75 పురపాలక సంఘాలు, నగరపాలక పంచాయతీలు...

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రెండోరోజు గురువారం వివిధ పార్టీల అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 75 పురపాలక సంఘాలు, నగరపాలక పంచాయతీలు, 12 నగర పాలక సంస్థల్లో కలిపి రెండోరోజు గురువారం మొత్తం 3380 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో మున్సిపాలిటీలు, నగరపాలక పంచాయతీల్లో 1997, మున్సిపల్ కార్పొరేషన్లలో 1383 ఉన్నాయి. తొలిరోజు బుధవారం వచ్చిన 386తో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 3716కు చేరింది.