స్వీయ నిర్బంధంలో 30,693 మంది: మంత్రి

ABN , First Publish Date - 2020-04-01T08:18:43+05:30 IST

‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. సీఎం జగన్మోహన్‌రెడ్డి చొరవతో రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు పటిష్ఠంగా...

స్వీయ నిర్బంధంలో 30,693 మంది: మంత్రి

నెల్లూరు (వైద్యం) మార్చి 31: ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. సీఎం జగన్మోహన్‌రెడ్డి చొరవతో రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు పటిష్ఠంగా అమలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా పర్యవేక్షణకు 30 మంది ఐఏఎస్‌ అధికారులను నియమించాం’’ అని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. నెల్లూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా విదేశాల నుంచి వచ్చిన 30,693 మంది స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారన్నారు. 262 మంది క్వారంటైన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

Updated Date - 2020-04-01T08:18:43+05:30 IST