-
-
Home » Andhra Pradesh » 305 corona cases
-
305 కరోనా కేసులు.. ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2020-12-15T09:30:10+05:30 IST
రాష్ట్రంలో కొత్తగా 305 మంది కరోనా బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో 44,935 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 305

(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో కొత్తగా 305 మంది కరోనా బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో 44,935 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 305 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా పశ్చిమగోదావరిలో 45, చిత్తూరులో 43, కృష్ణా జిల్లాలో 37 మంది కరోనా బారినపడ్డారు. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ 8,75,836 మంది కరోనా బారినపడగా... 8,64,049 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిపి 4,728 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. సోమవారం కరోనాతో నెల్లూరులో ఇద్దరు మరణించారు. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7059కి చేరాయి.