కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2020-03-04T13:22:33+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురంలో ఓ కారు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు మత్యపురి, కాజా గ్రామాలకు చెందిన సురేష్‌(22), చిట్టియ్య(45), కాశీ(22)గా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కారును వెలికితీసింది. రొయ్యల సీడ్‌ కోసం వెళ్తుండగా ఘటన జరిగింది. మృతదేహాలను పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-03-04T13:22:33+05:30 IST