-
-
Home » Andhra Pradesh » 25 TYPES OF INDUSTRIES
-
25 రకాల పరిశ్రమలు ఓకే
ABN , First Publish Date - 2020-03-25T08:06:48+05:30 IST
కరోనా వ్యాప్తి నిరోధక లాక్‌డౌన్ నుంచి 25 రకాల పరిశ్రమలను మినహాయిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అయుతే వాటిల్లోను సామాజిక దూరం...

- లాక్‌డౌన్ నుంచి వాటికి మినహాయింపు
- అక్కడా సామాజిక దూరం పాటించాలి
- పరిశ్రమల శాఖ మార్గదర్శకాలు జారీ
అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నిరోధక లాక్‌డౌన్ నుంచి 25 రకాల పరిశ్రమలను మినహాయిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అయుతే వాటిల్లోను సామాజిక దూరం పాటించాలని, ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకొని వీలైనంత తక్కువ సిబ్బందితోనే పనిచేయాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ మార్గదర్శకాలు జారీచేశారు. ధాన్యం, నూనె, పప్పుల మిల్లులు, డైరీ ఉత్పత్తులు, వర్మిసెల్లి, బిస్కట్లు, ఫ్రూట్ జ్యూస్, చక్కెర కర్మాగారాలు, వైద్య పరికరాల తయారీ పరిశ్రమలు, శానిటైజర్స్, హ్యాండ్ వాష్ ఉత్పత్తులు, న్యాప్‌కిన్, డైపర్ల ఉత్పత్తి సంస్థలు, చేపల ఫీడ్, కోళ్ల దాణా, పశు దాణా ఉత్పత్తి కర్మాగారాలు, ప్యాకేజింగ్ పరిశ్రమలు, విత్తన ప్రాసెస్ సంస్థలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్‌లు వీటిలో ఉన్నాయి. అన్ని పరిశ్రమలు తమ పనివారికి, సిబ్బందికి వేతనాలు, జీతాలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. తమ సిబ్బందికి కరోనా జాగ్రత్తల గురించి చెప్పాలని, వారికి రవాణా సౌకర్యం ఏర్పాటుచేయాలని సూచించారు.