కల్తీ సారా తాగి 25 మందికి అస్వస్థత
ABN , First Publish Date - 2020-12-28T08:46:35+05:30 IST
శ్రీకాకుళం జిల్లా సోం పేట మండలం సిరమామిడిలో కల్తీ సారా తాగి 25 మంది అస్వస్థతకు గురయ్యారు.
సోంపేట రూరల్, డిసెంబరు 27: శ్రీకాకుళం జిల్లా సోం పేట మండలం సిరమామిడిలో కల్తీ సారా తాగి 25 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సిరమామిడిలో శనివారం మృతిచెందిన వ్యక్తి దహన సంస్కారాలకు గ్రామానికి చెందిన కొందరితో పాటు మందస మం డలం పితాళికి చెందిన మరికొందరు మొత్తం 25 మంది హాజరయ్యారు. అక్కడే సారా తాగి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రికి వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారందరినీ ఆస్పత్రులకు తరలించగా వీరిలో కారాగి పాపారావు, కారాగి రుద్రయ్యల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.