ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి.. 24 గంటల్లో 25 కొత్త కేసులు

ABN , First Publish Date - 2020-05-17T17:43:07+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపిస్తోంది. మే నెల ప్రారంభం నుంచి కేసులు చాలా వరకు తగ్గిపోయాయ్..

ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి.. 24 గంటల్లో 25 కొత్త కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపిస్తోంది. మే నెల ప్రారంభం నుంచి కేసులు చాలా వరకు తగ్గిపోయాయ్. అంతకు మునుపు 70, 100 సంఖ్యలో నమోదయ్యే కేసులు 30, 35కి తగ్గాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా నుంచి చాలా వరకు ఏపీ కోలుకున్నట్లేనని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా గత 24 గంటల్లో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2230కు చేరుకుంది. ఈ 25 కేసుల్లో చిత్తూరు-04, గుంటూరు-04, కర్నూలు-03, నెల్లూరు-01, ప్రకాశం-03, శ్రీకాకుళం-07, విశాఖపట్నం-03 కేసులు నమోదయ్యాయి.


డిశ్చార్జ్, మరణాల లెక్కలు ఇవీ..

కరోనాతో ఇప్పటివరకు రాష్ట్రంలో 50మంది మృతి చెందారు. కరోనా జయించి 1433మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 747. రాష్ట్రంలో గత 24 గంటల్లో (శనివారం 9గంటల నుంచి ఆదివారం 9 గంటల వరకూ) 9,880 శాంపిల్స్‌ను పరీక్షించగా 25 మంది కరోనా పాజిటివ్‌గా నిర్దారింపబడ్డారు. కొత్తగా 103 మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. 24 గంటలుగా ఒక్కరు మాత్రమే మరణించారు. చనిపోయిన వ్యక్తి కృష్ణా జిల్లాకు చెందిన వాసి.


జిల్లాల వారిగా కేసుల లెక్కలివీ..



Updated Date - 2020-05-17T17:43:07+05:30 IST