ఎర్రచందనం కేసుల విచారణకు తిరుపతిలో 2 ప్రత్యేక కోర్టులు
ABN , First Publish Date - 2020-06-18T08:35:05+05:30 IST
ఎర్రచందనం కేసులను ప్రత్యేకంగా విచారించడానికి తిరుపతిలో రెండు ప్రత్యేక కోర్టులు ఏర్పాటవుతున్నాయి. కోర్టుల నిర్వహణకు అవసరమైన పోస్టులను కూడా మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది...

తిరుపతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం కేసులను ప్రత్యేకంగా విచారించడానికి తిరుపతిలో రెండు ప్రత్యేక కోర్టులు ఏర్పాటవుతున్నాయి. కోర్టుల నిర్వహణకు అవసరమైన పోస్టులను కూడా మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులను విచారించడానికి ఈ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తాన్ని ఈ రెండు కోర్టుల పరిధిలోకి తీసుకువచ్చారు. ఇందులో ఒకటి అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కోర్టు కాగా.. రెండోది జూనియర్ సివిల్ జడ్జి (జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు) కోర్టు.