నెట్‌వర్క్ ఆస్పత్రులకు 180 కోట్లు విడుదల
ABN , First Publish Date - 2020-10-14T08:19:20+05:30 IST
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల బకాయిల నిమిత్తం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రూ.180.34 కోట్లు విడుదల చేసింది. ట్రస్ట్ పరిధిలోని...

అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల బకాయిల నిమిత్తం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రూ.180.34 కోట్లు విడుదల చేసింది. ట్రస్ట్ పరిధిలోని 573 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు, 544 ఈహెచ్‌ఎస్ ఆస్పత్రులకు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న మొత్తం బాకాయిలను అధికారులు చెల్లించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లించాల్సిన రూ.148.37 కోట్లు, ఈహెచ్‌ఎస్ కింద చెల్లించాల్సిన రూ.31.97 కోట్లను నెట్‌వర్క్ ఆస్పత్రుల ఖాతాల్లో జమ చేశారు. సీఎం ఆదేశాల మేరకు నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లిస్తున్నామని ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఏ.మల్లికార్జున్ తెలిపారు.