కువైత్‌ నుంచి 160 మంది తెలుగోళ్ల బహిష్కరణ

ABN , First Publish Date - 2020-03-21T12:50:00+05:30 IST

కువైత్‌ నుంచి 160 మంది తెలుగోళ్ల బహిష్కరణ

కువైత్‌ నుంచి 160 మంది తెలుగోళ్ల బహిష్కరణ

వీరిలో అత్యధికులు కడప జిల్లావాసులే 

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): కరోనా మహమ్మారి నిర్మూలనలో భాగంగా గల్ఫ్‌ దేశమైన కువైత్‌.. విదేశీయులను అరెస్టుచేసి దేశం నుంచి బహిష్కరిస్తోంది. వారిని స్వదేశాలకు పంపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల సుమారు 350 మందిని అరెస్టుచేసింది. వీరిని ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలించింది. వీరిలో 160మందికిపైగా తెలుగువాళ్లే. వీరిలో అత్యధికులు కడప జిల్లావాసులని తెలిసింది. వీరిలో చెన్నూరు ప్రాంతానికి చెందిన రెండేళ్ల పసిపాప కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పాపకు జన్మనిచ్చిన తల్లి ఆ పాపను ఆస్పత్రిలోనే వదిలేసి పారిపోగా.. ఆ తర్వాత కువైత్‌ పోలీసులు అరెస్టుచేసి జైల్లో ఉంచారు. ప్రత్యేక విమానంలో వీరిద్దరిని కూడా పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం కువైత్‌ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం ఉంది. అయితే కువైత్‌ అమీర్‌ (రాజు) ఇచ్చిన ప్రత్యేక అనుమతితో 350 మంది భారతీయులతో శుక్రవారం రాత్రి ఈ విమానం బయల్దేరినట్లు సమాచారం. శనివారం ఉదయం ముంబై విమానాశ్రయానికి వీరంతా చేరుకుంటారు. అక్కడ వారిని 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు.

Updated Date - 2020-03-21T12:50:00+05:30 IST