స్కూలు బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2020-02-08T18:36:05+05:30 IST

ప్రకాశం: స్కూలు బస్సు బోల్తా పడటంతో 15 మందికి తీవ్ర గాయాలైన ఘటన ప్రకాశం జిల్లా కురిచేడు వద్ద జరిగింది. శ్రీ చైతన్య స్కూల్ ఉపాధ్యాయులు భైరవకోన వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

స్కూలు బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు

ప్రకాశం: స్కూలు బస్సు బోల్తా పడటంతో 15 మందికి తీవ్ర గాయాలైన ఘటన ప్రకాశం జిల్లా కురిచేడు వద్ద జరిగింది. శ్రీ చైతన్య స్కూల్ ఉపాధ్యాయులు భైరవకోన వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. 

కురిచేడు - దొనకొండ మధ్యనున్న పొట్లపాడు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో నరసరావుపేట వినుకొండకు చెందిన శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ ఉపాధ్యాయులు 30 మందికి పైగా ఉన్నారు. క్షతగాత్రులను కురిచేడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు తరలించినట్లు తెలుస్తోంది.Updated Date - 2020-02-08T18:36:05+05:30 IST