వచ్చే ఏడాది 13 మంది ఐఏఎస్‌ల పదవీ విరమణ
ABN , First Publish Date - 2020-10-27T08:39:46+05:30 IST
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 13మంది అఖిల భారత సర్వీసు అధికారులు 2021లో రిటైర్ కానున్నారు.

అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 13మంది అఖిల భారత సర్వీసు అధికారులు 2021లో రిటైర్ కానున్నారు. పి.ఉషాకుమారి జనవరిలో, బి.ఉదయలక్ష్మి మార్చిలో, డి.మార్కండేయులు, శామ్యూల్ ఆనంద్‌కుమార్ మే నెల చివరిలో పదవీ విరమణ చేయనున్నారు. జూన్‌లో ఆదిత్యనాథ్ దాస్, కె.రామ్‌గోపాల్, బి.రామారావు.. జూలైలో అభయ్ త్రిపాఠి, నవంబరులో సతీశ్‌చంద్ర, సమీర్‌శర్మ, ఉషారాణి.. డిసెంబరులో జే ఎస్‌వీ ప్రసాద్ రిటైర్ కానున్నారని రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.