ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల తాజా అప్‌డేట్ ఇది..!

ABN , First Publish Date - 2020-03-28T03:29:32+05:30 IST

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు 13కి చేరాయి. గుంటూరు, విశాఖలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వచ్చిన వ్యక్తుల నుంచి...

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల తాజా అప్‌డేట్ ఇది..!

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు 13కి చేరాయి. గుంటూరు, విశాఖలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వచ్చిన వ్యక్తుల నుంచి వైరస్‌ ఇద్దరికి సోకినట్లు తెలిసింది. ఢిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన గుంటూరు వాసికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తి నుంచి భార్యకు కూడా వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఢిల్లీ వెళ్లొచ్చిన మరో 12 మంది రిపోర్ట్‌లు రావాల్సి ఉందని వైద్యులు తెలిపారు.


విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 29,262 మందిపై ప్రభుత్వం నిఘా పెట్టింది. మొత్తం 406 మందికి కరోనా టెస్ట్‌లు చేయగా 317 మందికి నెగిటివ్ వచ్చినట్లు తెలిసింది. మొత్తం 25 మంది రిపోర్ట్‌లు రావాల్సింది ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. నూజివీడు అజరయ్యపేటకు చెందిన యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఖజకిస్తాన్ నుంచి వచ్చిన యువతి హోం క్వారంటైన్‌లో ఉండకపోవడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-03-28T03:29:32+05:30 IST