11వ పీఆర్సీ గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-03-18T13:14:26+05:30 IST

11వ పీఆర్సీ గడువు పొడిగింపు

11వ పీఆర్సీ గడువు పొడిగింపు

అమరావతి(ఆంధ్రజ్యోతి): 11వ వేతన సవరణ సంఘం గడువును ప్రభుత్వం రెండు నెలలు పొడిగించింది. ఇప్పటికే పీఆర్సీ గడువు ముగియడంతో ఈ మేరకు మంగళవారం పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా రవాణా విభాగంలో ఉద్యోగులుగా మారిన ఏపీఎస్‌ ఆర్టీసీకి సంబంధించిన వేతనాల చెల్లింపు ప్రక్రియ, పెన్షన్‌ తదితర అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి వేతన సవరణ సంఘం నివేదిక ఇవ్వనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పీఆర్సీ చైర్మన్‌ అశుతోష్‌ మిశ్రా పదవీ కాలం కూడా మరో రెండు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - 2020-03-18T13:14:26+05:30 IST