ఏపీలో టెన్త్‌ పరీక్షలు వాయిదా

ABN , First Publish Date - 2020-03-24T17:59:50+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీచేసింది. ఈనెల 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి

ఏపీలో టెన్త్‌ పరీక్షలు వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీచేసింది. ఈనెల 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి తేదీలను ఖరారు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంసెట్, ఐసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువునూ పొడిగిస్తున్నట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. 


కాగా, ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిటిషన్‌ను పరిశీలనకు హైకోర్టు ధర్మాసనం తీసుకుంది. అయితే వాయిదాపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కాసేపటికే పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

Read more