యూపీలో ఏపీకి చెందిన పది మంది అరెస్ట్

ABN , First Publish Date - 2020-04-08T14:58:29+05:30 IST

ఏపీ నుంచి మత ప్రార్థనల కోసం అంటూ ఢిల్లీ వెళ్లిన పది మంది వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో తలదాచుకున్నారు. లక్నోలోని చౌక్ సెంటర్లో బావాజీ ప్రాంతంలో పదిమంది ఏపీకి చెందిన వారు తల దాచుకున్నట్లు లక్నో పోలీసులకు సమాచారం

యూపీలో ఏపీకి చెందిన పది మంది అరెస్ట్

అమరావతి: ఏపీ నుంచి మత ప్రార్థనల కోసం అంటూ ఢిల్లీ వెళ్లిన పది మంది వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో తలదాచుకున్నారు. లక్నోలోని చౌక్ సెంటర్లో బావాజీ ప్రాంతంలో పదిమంది ఏపీకి చెందిన వారు తల దాచుకున్నట్లు లక్నో పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మంగళవారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారికి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని, ఏపీకి చెందిన పది మందిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ పదమందికీ కరోనా పాజిటివ్ అని తేలడంతో లక్నో అధికార యంత్రాంగం అంతా అవాక్కైంది. కరోనా పాజిటివ్ అని తెలిసీ బయటకు చెప్పకుండా ఉన్నందుకు వీరందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని లక్నో వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ధృవీకరించారు. బావాజీ ప్రాంతంలో గట్టి బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, ఆ ప్రాంతం వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా టెస్టులు చేస్తున్నారు.

Updated Date - 2020-04-08T14:58:29+05:30 IST