-
-
Home » Andhra Pradesh » 10 lakh assistance to Delhi peasant movement
-
ఢిల్లీ రైతు ఉద్యమానికి 10 లక్షల సాయం
ABN , First Publish Date - 2020-12-27T08:36:09+05:30 IST
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అన్ని రైతు సంఘాలు కలిసి ఢిల్లీ వెళ్లి తమ వంతుగా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్టు కిసాన్ సంఘర్ష కో-ఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు.

వడ్డే శోభనాద్రీశ్వరరావు
విజయవాడ సిటీ, డిసెంబరు 26: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అన్ని రైతు సంఘాలు కలిసి ఢిల్లీ వెళ్లి తమ వంతుగా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్టు కిసాన్ సంఘర్ష కో-ఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ కొన్ని రాష్ట్రాల్లో రైతులతో మాట్లాడుతూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ చట్టాలను తెచ్చినట్టు చెబుతున్నారని, ఇది పచ్చి అబద్ధ్దమన్నారు. మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల రోజులుగా రైతులు చలిలో ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని జాలి, దయ చూపకపోవడం దారుణమన్నారు.