కింగ్ కోబ్రా vs రస్సెల్ వైపర్.. ఏది ఎక్కువ విషపూరితమంటే..

కింగ్ కోబ్రా ప్రపంచంలో అత్యంత విషపూరితమైన, పెద్ద పాము. దీని విషం న్యూరోటాక్సిక్, నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

రస్సెల్ వైపర్ భారతదేశంలోని నాలుగు అతిపెద్ద పాములలో ఒకటి. దీని విషం హెమోటాక్సిక్, రక్తం గడ్డకట్టడం, కణజాలాలను ప్రభావితం చేస్తుంది.

కింగ్ కోబ్రా ఒక్క కాటుకు ఎక్కువ విషాన్ని విడుదల చేస్తుంది. అదే రస్సెల్ వైపర్ విషం తక్కువగా ఉంటుంది.

కింగ్ కోబ్రాకు పొడవాటి కోరలు ఉంటాయి. ఇవి లోతుగా చొచ్చుకుపోతాయి. కానీ రస్సెల్ వైపర్ చిన్న కోరలు కలిగి ఉంటుంది.

ఆగ్నేయాసియా అడవులలో కింగ్ కోబ్రాలు ఎక్కువ. దక్షిణ, ఆగ్నేయాసియా అంతటా రస్సెల్ వైపర్స్ ఎక్కువ.

కింగ్ కోబ్రా రెచ్చగొట్టకపోతే సైలెంట్ గా ఉంటుంది. కానీ రస్సెల్ వైపర్ బెదింపులకు లోనైనప్పుడు దూకుడుగా ఉంటుంది.

కింగ్ కోబ్రా, రస్సెల్ వైపర్ రెండింటికి యాంటీ వీనమ్ అందుబాటులో ఉంది.

రస్సెల్ వైపర్ కాటుకు గురయ్యే వారు ఎక్కువ. కానీ దీని యాంటీ వీనమ్ ఆశించినంత ప్రజలకు అందుబాటులో లేదు. ఈ కారణంగా రస్సెల్ వైపర్ కారణంగా సంభవిస్తున్న మరణాలు ఎక్కువ.