రాగి పాత్రల్లో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. అయితే ఈ పాత్రలను శుభ్రం చేయడానికి 5 సులభ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయ, ఉప్పుతో రాగి పాత్రలను శుభ్రం చేస్తే మరకలు సలభంగా తొలగిపోతాయి.

నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్, ఉప్పు రాపిడి కారణంగా పాత్రల్లోని మొండి మరకలు కూడా తొలగిపోతాయి.

వెనిగర్, ఉప్పు మిశ్రమంతో కూడా రాగి పాత్రలను సులభంగా శుభ్రం చేయొచ్చు.

మరకలు ఉన్న ప్రదేశంలో వెనిగర్ రాసి కొద్ది సేపటి తర్వాత బ్రష్‌తో రుద్దితే శుభ్రంగా ఉంటాయి.

టమాటో సాస్‌తో రాగి పాత్రలు శుభ్రం చేస్తే మరకలు సులభంగా తొలగిపోతాయి.

రాగి పాత్రలోని మురికిపై టమాటో సాస్ వేసి, కొద్దిసేపటి తర్వాత స్పాంజితో శుభ్రం చేయాలి.

టూత్ పేస్ట్‌తో కూడా రాగి పాత్రలను శుభ్రం చేయొచ్చు.

పాత్రలోని మరకలపై నాన్-జెల్ టూత్ పేస్ట్ రాసిన కాసేపటి తర్వాత స్క్రబ్ చేయాలి.

బేకింగ్ సోడా, నిమ్మ రసంతో కూడా రాగి పాత్రలను శుభ్రం చేయొచ్చు.