ఉపాధి హామీ కూలీల వేతనాలు పెరిగాయ్..

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉపాధి హామీ కూలీల వేతనాలను పెంచింది కేంద్రం.

 వివిధ రాష్ట్రాలకుగానూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 4 - 10 శాతం వరకు వేతనాలు పెంచింది. 

తాజా పెంపుతో హర్యానాలో అత్యధిక వేతనం రోజుకు రూ.374 అందనుండగా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో అత్యల్పంగా రూ.234 వేతనం అందనుంది. 

తెలంగాణలో రూ.28 పెంచడంతో  రోజువారీ కూలీ రూ.300కి చేరింది. 

ఆంధ్రప్రదేశ్‌లో వేతన పెంపు రూ.28గా ఉంది. ఇప్పుడు మొత్తం కూలీ రూ.300కి చేరింది.

పశ్చిమ బెంగాల్‌లో రూ.250 (రూ.13 పెరుగుదల), తమిళనాడులో రూ.319 (రూ.25 పెరుగుదల), బీహార్‌లో రూ.228 (రూ.17 పెరుగుదల)గా ఉంది. 

వేతన రేటు పరంగా హర్యానా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, పెరుగుదల కేవలం నాలుగు శాతంగానే ఉంది.

తెలంగాణ, ఏపీ, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 10 శాతం పెరుగుదల నమోదైందని నోటిఫికేషన్ డేటా వెల్లడిస్తోంది.