ఈ డ్రింక్స్ తాగితే..  వేగంగా బరువు తగ్గొచ్చు

శరీర బరువు, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని చాలామంది ప్రయత్నిస్తారు. కొందరు డైట్ ఫాలో అయితే, మరికొందరు సర్జరీలు చేయించుకుంటారు. అయితే.. వీటి వల్ల సమస్యలు తలెత్తొచ్చు.

అలా కాకుండా.. ఇంట్లోనే కొన్ని డ్రింక్స్ తయారు చేసుకొని తాగితే, వేగంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పైగా.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవు.

అల్లం-పసుపు టీ: అల్లం, పసుపు, నిమ్మ, పుదీనాతో తయారు చేస్తారు. అల్లంలోని జింజెరాల్.. వేడి పెంచి, జీవక్రియలు సక్రమంగా సరిగేలా చేస్తుంది. దీని వల్ల ఫ్యాట్, ట్యాక్సిన్స్ తగ్గుతాయి.

నిమ్మరసం: ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సీ, ఫైబర్.. శరీర బరువుని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి.. దీనిని తరుచుగా తాగితే ఎంతో బెటర్.

పుదీనా: ఇందులోని మెంథాల్.. జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. ఈ ఆకుల్లో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గుతారు.

పసుపు: ఇందులోని కర్కుమిన్.. అధిక బరువు ఉన్నవారిలో కొవ్వు కణాలని తగ్గించి, బరువు పెరగకుండా చేస్తుంది. దీంతో జీవక్రియ పెరిగి, బాడీలోని కొలెస్ట్రాల్ కరుగుతుంది.

జీరా వాటర్: ఈ డ్రింక్‌లో ఉండే విటమిన్స్, కాపర్, మాంగనీస్ కొవ్వును విచ్ఛిన్నం చేసి, మంచి బ్యాక్టీరియాను ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇవన్నీ అధిక బరువుకు చెక్ పెడతాయి.

గ్రీన్ టీ: యాంటీఆక్సిడెంట్టు పుష్కలంగా లభించే గ్రీన్ టీ, జీవక్రియను పెంచి కొవ్వును కరిగిస్తుంది. దీంతో బరువు తగ్గడం సులభం అవుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్: ఈ డ్రింక్‌ను రోజూ పొద్దున్నే తాగితే ఆకలి కంట్రోల్ అవుతుందని, తద్వారా వెయిట్ మేనేజ్‌మెంట్ సాధ్యమవుతుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.