ఆరోగ్యం బిందాస్ గా ఉండటానికి 7 అద్భుత అలవాట్లు..!

ఆరోగ్యం బాగుంటే ఏ పని అయినా చేయగలుగుతారు. 7 అద్భుతమైన అలవాట్ల వల్ల ఆరోగ్యాన్ని బిందాస్ గా ఉంచుకోవచ్చు.

ఇండోర్ నడక, ట్రెడ్ మిల్ మీద రన్నింగ్ వంటివి వదిలి ప్రకృతిమధ్య నడకకు వెళ్లాలి.  ఇది శారీరక ఆరోగ్యాన్నే కాదు.. మనసును కూడా ఆహ్లాదంగా మారుస్తుంది.

ప్రతిరోజూ ఉదయాన్ని నవ్వుతో ప్రారంభించాలి. ఇది పాజిటివ్ దృక్పథం రోజంతా ఉండేలా చేస్తుంది.

ప్రశాంతత ఎలాంటి గందరగోళాన్ని అయినా దూరం చేస్తుంది. అందుకోసం రోజూ ధ్యానం చేయాలి.

రోజూ ఏం తింటున్నాం? దానివల్ల శరీరానికి ఒరిగేది ఏంటి? వంటివి గమనించుకోవాలి. ప్రాసెస్ చేయని ఆహారాలను ఎంచుకోవాలి.

శరీరం హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. రోజును గ్లాసుడు నీటితో మొదలెట్టాలి. ఇది శరీరాన్ని, గొంతును ఆరోగ్యంగా ఉంచుతుంది.

టివి, మొబైల్, సిస్టమ్ మాయలో పడకండి.  వీటిని ఎంత తక్కువ వినియోగిస్తే అంత బావుంటారు.

శ్వాస మీద దృష్టి పెట్టాలి.  లోతుగా శ్వాస తీసుకునే శ్వాస వ్యాయామాలు నాడీవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.