Share News

MLC Election: తెలంగాణలో మరో ఎన్నిక.. షెడ్యూల్ విడుదల

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:25 PM

ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదలైంది.

MLC Election: తెలంగాణలో మరో ఎన్నిక.. షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు-2024 హడావుడి కొనసాగుతున్న వేళ తెలంగాణలో మరో ఎన్నికకు తేదీ ఖరారైంది. ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. మే 2న నోటిఫికేషన్ విడుదలకానుంది. నామినేషన్‌కు చివరి తేదీ 9గా ఉంది. ఇక నామినేషన్ పరిశీలనకు మే 10, ఉపసంహరణ తేదీ మే 13 అని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. కాగా మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక జూన్ 5న ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ చేయనుంది.

Updated Date - Apr 25 , 2024 | 03:34 PM