KCR: నేడు బీఆర్‌ఎస్ నిరసనలు
ABN , Publish Date - May 16 , 2024 | 04:45 AM
ఎన్నికల హామీలు అమలు చేయకుండా రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తోందని, సర్కారు చర్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ధాన్యానికి రూ.500బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు సన్న రకాల ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచించడమేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సన్న రకం ధాన్యాన్ని 10శాతం మాత్రమే పండిస్తారని, 90శాతం ఇతర రకాల ధాన్యం వస్తుందని పేర్కొన్నారు.
రైతు వ్యతిరేక చర్యలను సహించం: కేసీఆర్
హైదరాబాద్, మే15 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీలు అమలు చేయకుండా రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తోందని, సర్కారు చర్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ధాన్యానికి రూ.500బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు సన్న రకాల ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచించడమేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సన్న రకం ధాన్యాన్ని 10శాతం మాత్రమే పండిస్తారని, 90శాతం ఇతర రకాల ధాన్యం వస్తుందని పేర్కొన్నారు. ఓట్లు వేసుడు అయిపోగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని, మాటమార్చేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు... రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
కరెంటు కోతల నియంత్రణపై చిత్తశుద్ధి ఏది?
రాష్ట్రంలో కరెంటు కోతల నియంత్రణపై చిత్తశుద్ధి లేని సీఎం రేవంత్.. అనవసరంగా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై నిందారోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. విద్యుత్ రంగ వైఫల్యాలకు తమను బాధ్యులను చేసి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్ప కూల్చిందని విమర్శించారు.