Share News

తై బజార్‌ పేరిట అక్రమ వసూళ్లు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:26 AM

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో పశువుల సంత ఎంతో పేరుగాంచింది. ప్రతీ ఆదివారం సంతకు వందల సంఖ్యలో వా హనాలు, వస్తూపోతుంటాయి. ఇదే అదునుగా భావించిన సంత కాంట్రాక్టర్‌ ఎలాంటి తీర్మానాలు, అనుమతులు లేకుండా రెండేళ్ల నుంచి పార్కింగ్‌ ఫీజులు, తై బజార్‌ ఫీజులు అక్రమంగా వసూలు చే స్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

 తై బజార్‌ పేరిట అక్రమ వసూళ్లు

తై బజార్‌ పేరిట అక్రమ వసూళ్లు

పార్కింగ్‌ పేరుతో ఫీజు

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

కొండమల్లేపల్లి, ఏప్రిల్‌ 28: కొండమల్లేపల్లి మండల కేంద్రంలో పశువుల సంత ఎంతో పేరుగాంచింది. ప్రతీ ఆదివారం సంతకు వందల సంఖ్యలో వా హనాలు, వస్తూపోతుంటాయి. ఇదే అదునుగా భావించిన సంత కాంట్రాక్టర్‌ ఎలాంటి తీర్మానాలు, అనుమతులు లేకుండా రెండేళ్ల నుంచి పార్కింగ్‌ ఫీజులు, తై బజార్‌ ఫీజులు అక్రమంగా వసూలు చే స్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తతంగమంతా అధికారుల కనుసైగల్లోనే నడుస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. తైబజార్‌ పేరిట డ బ్బులు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో పదేళ్ల క్రితం నిలిపివేశారు. మళ్లీ ఇప్పుడు వసూలు చేస్తున్నారని పట్టణానికి చెందిన కొందరు యువకులు ఆరోపించారు. అంతేకాక అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇష్టానురీతిగా వ్య వహరిస్తున్నారు. ప్రతీ ఆదివారం తైబజార్‌ పేరిట గ్రామపంచాయతీ ముద్ర వేసి రూ.15 నుంచి 20వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శి వీరబాబును వివర ణ కోరగా సంతలో ఎవరైనా అక్రమంగా వసూలు చేస్తే వారిపై కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Apr 29 , 2024 | 12:26 AM