Share News

దేవరకొండలో మండుతున్న ఎండలు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:25 AM

దేవరకొండ డివిజన లో గతంలో ఎన్నడూ లేని విధం గా ఎండలు మం డుతున్నాయి.

 దేవరకొండలో మండుతున్న ఎండలు
ఎండవేడిమితో నిర్మానుష్యంగా మారిన కోదాడ - జడ్చర్ల జాతీయ రహదారి

దేవరకొండలో మండుతున్న ఎండలు

నిర్మానుష్యంగా మారిన జాతీయ రహదారి

దేవరకొండ, ఏప్రిల్‌ 28: దేవరకొండ డివిజన లో గతంలో ఎన్నడూ లేని విధం గా ఎండలు మం డుతున్నాయి. ఉ దయం 10 గంట ల నుంచే ఎండవేడిమి ప్రారంభమవుతుండటం తో ఇళ్లలో నుంచి బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. 45 డిగ్రీల వరకు ఉ ష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డివిజనలో ఈ ఏడాది వర్షాలు కురియకపోవడంతో ఇప్పటి కే చెరువులు, కుంటలు నీరులేక వట్టిపోయాయి. వర్షపాతం కూడా తక్కువగా నమోదైంది. ఎండలు మండుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు. కోదాడ, జడ్చర్ల జాతీయ రహదారి మధ్యాహ్నం 12 గంటలకే నిర్మానుష్యంగా కనిపించింది. అత్యవసర పరిస్థితులలోనే బ యటకు వెళ్లాలని, గొడుగు లేదా రుమాలు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. డిండి ప్రా జెక్టు నుంచి చందంపేట, నేరేడుగొమ్ము మండలాలలోని చెరువులు, కుంటలకు నీరు వదులుతుండటంతో ఆయా మండలాల పరిధిలోని రైతులు కొంత ఊరట చెందుతున్నారు. బో రు, బావుల్లో భూగర్భజలాలు పెరగడంతో పాటు పశువులు, మూగజీవాలకు తాగునీరు ఉ పయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:25 AM