Share News

రేవంత్‌ సర్కారును బీజేపీ కూల్చదు

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:42 AM

ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఒక్క సీటు కూడా రాదని, రాష్ట్రంలో బీజేపీ రెండంకెల సీట్లను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రేవంత్‌ సర్కారును బీజేపీ కూల్చదు

  • అదే కూలిపోతే మాకు సంబంధం లేదు.. కేసీఆర్‌ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారు

  • ముస్లిం రిజర్వేషన్లను బరాబర్‌ ఎత్తేస్తాం: కిషన్‌రెడ్డి

బర్కత్‌పుర, నల్లకుంట, హైదరాబాద్‌ ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): రేవంత్‌ సర్కారును బీజేపీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చబోదని, అదే కూలిపోతే తమకు ఎలాంటి సంబంధం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం శివం రోడ్‌లోని ఓ హోటల్‌లో, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు లోక్‌సభ ఎన్నికల్లో

బీజేపీకి ప్రజల ఆదరణ పెరుగుతుంటే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఓర్వలేకపోతున్నాయన్నారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో తాను ఎలాంటి అభివృద్ధి చేయలేదని నిందలుమోపుతున్నారని, ఇది వాస్తవం కాదని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేశానని తెలిపారు. 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ, 450 కోట్ల వ్యయంతో కాచిగూడ రైల్వే స్టేషన్‌, 350 కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని వివరించారు. ఎంఎంటీఎస్‌ రెండవ దశకు కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు భరించి అభివృద్ధి చేస్తోందన్నారు. ఎంఎంటీఎ్‌సను యాదాద్రి వరకు పొడిగించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు జీహెచ్‌ఎంసీ వల్లే ఆలస్యమవుతున్నాయని, వీటిని త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించామని ఆయన తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవని కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని, మతిభ్రమించినవాళ్లే ఇలాంటి మాటలు మాట్లాడుతారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్‌లను బరాబర్‌ ఎత్తేస్తామని తేల్చిచెప్పారు. బీసీల్లోని పేదలకు అన్యాయం చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్‌లను అమల్లోకి తెచ్చిందని ఆరోపించారు. టీషర్టు వేసుకున్నంత మాత్రాన యువకులైపోరు.. అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రాహుల్‌ మాటలను యువత ఏమాత్రం నమ్మదన్నారు. ఒట్లు పెట్టుకుంటే ఓట్లు పడవన్న సంగతిని సీఎం రేవంత్‌ గుర్తించాలన్నారు. తెలంగాణాకు నష్టం చేసింది కేసీఆర్‌, ఆయన కుటుంబమే అని ఆరోపించారు. కేసీఆర్‌ ఇక ఫాంహౌజ్‌కు పరిమితం కావడమే మంచిదని కిషన్‌రెడ్డి సూచించారు.

Updated Date - Apr 27 , 2024 | 05:42 AM