Share News

హామీలన్నీ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రభుత్వం

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:24 AM

ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ చేసిన ఆ రు గ్యారెంటీలను ముఖ్యమంత్రి రే వంతరెడ్డి అమ లు చేస్తున్నట్లు ఎ మ్మెల్యే నేనావత బాలునాయక్‌ అ న్నారు.

 హామీలన్నీ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రభుత్వం
పార్టీలో చేరిన పీఏపల్లి నాయకులతో ఎమ్మెల్యే బాలునాయక్‌

హామీలన్నీ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రభుత్వం

దేవరకొండ, ఏప్రిల్‌ 28: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ చేసిన ఆ రు గ్యారెంటీలను ముఖ్యమంత్రి రే వంతరెడ్డి అమ లు చేస్తున్నట్లు ఎ మ్మెల్యే నేనావత బాలునాయక్‌ అ న్నారు. దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం చందంపేట, డిండి మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు 200మంది కాంగ్రె్‌సలో చేరినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ, డిండి, నక్కలగండి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నల్లగొండ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు జా ల నర్సింహారెడ్డి, ఎంఎ. సిరాజ్‌ఖాన, ముక్కమళ్ల వెంకటయ్యగౌడ్‌, సర్వయ్య యా దవ్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్దఅడిశర్లపల్లి: మండలానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రె్‌సలో ఆదివారం చేరారు. ఉమ్మడి పీఏపల్లి మండలంలోని బీఆర్‌ఎస్‌ ఎంపీపీ వంగాల ప్రతా్‌పరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన తేరా మణిపాల్‌రెడ్డితో సహా ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, డైరెక్టర్లు, బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి తోటకూరి పరమేష్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులు, గ్రా మ శాఖ అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో పాటు సుమారు 200 మంది ఎమ్మెల్యే బా లునాయక్‌ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యద ర్శి కుక్కల గోవర్ధనరెడ్డి, మండల అధ్యక్షుడు వీరబోయిన ఎల్లయ్య, వర్కింగ్‌ ప్రె సిడెంట్‌ నెర్మటి సతీ్‌షరెడ్డి, నాయకులు వంగాల వెంకట్‌రెడ్డి, ముచ్చర్ల ఏడుకొండ లు యాదవ్‌, మాజీ ఎంపీపీ తేరా సత్యంరెడ్డి, కసిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, సీరజ్‌ఖాన, కల్లూరి శ్రీనివా్‌సరెడ్డి, పాల్వయి వెంకట్‌రెడ్డి, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు గండు దయాకర్‌, శంకరయ్య, చందునాయక్‌, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:24 AM