Share News

కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రజల సంక్షేమం

ABN , Publish Date - Apr 28 , 2024 | 10:07 PM

కాంగ్రెస్‌తోనే ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్‌ చౌదరి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామిలు పేర్కొ న్నారు. ఆదివారం జన్కాపూర్‌లో నిర్వహించిన చేరికల సభ లో మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలు పునకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాల న్నారు.

కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రజల సంక్షేమం

కన్నెపల్లి, ఏప్రిల్‌ 28: కాంగ్రెస్‌తోనే ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్‌ చౌదరి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామిలు పేర్కొ న్నారు. ఆదివారం జన్కాపూర్‌లో నిర్వహించిన చేరికల సభ లో మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలు పునకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాల న్నారు. అనంతరం భీమిని, కన్నెపల్లి మండలాల నుంచి మాజీ సర్పంచులు, వార్డు సభ్యులతో పాటు దాదాపు 800 మంది కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీపీ సృజననర్సిం గరావు, లక్ష్మీనారాయణ, రామాంజనేయులు పాల్గొన్నారు.

భీమిని: భీమిని, మల్లీడి, రాంపూర్‌, వీగాం, చిన్నగుడిపేట, చిన్నతిమ్మాపూర్‌ గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కన్నెపల్లి మండలం జన్కాపూర్‌లో ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్‌ చౌదరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వీగాం ఎంపీటీసీ కర్నె మమత, మాజీ సర్పం చులు ఎల్లాగౌడ్‌, సంతోష్‌, భూమయ్య, కవిత, మాజీ వైస్‌ ఎంపీపీ గడ్డం మహేష్‌ గౌడ్‌, నాయకులు ఉన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చేరారు.

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికే చేరికలు

బెల్లంపల్లి: పార్టీ బలోపేతానికే ఇతర పార్టీల నాయకుల ను చేర్చుకుంటున్నామని ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్‌ చౌదరి అన్నారు. ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇతర పార్టీల నాయ కులను చేర్చుకుంటున్నామని, పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. పార్టీలో చేరుతున్న వారితో సీనియర్‌ కాం గ్రెస్‌ నాయకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎవరి ప్రాధా న్యం వారికే ఉంటుదని పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కలిసిక ట్టుగా ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం రోహి త్‌ చౌదరిని కాంగ్రెస్‌ నాయకులు సన్మానించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, పట్టణాధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, నాయకులు సూరి బాబు, నాతరి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 10:07 PM