Share News

ముగిసిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలు

ABN , Publish Date - Apr 26 , 2024 | 10:07 PM

పట్టణంలోని ప్రైవేట్‌ పాఠ శాలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ పురు షుల, మహిళల ప్రీమియర్‌ లీగ్‌ పోటీలు శుక్రవారం ముగిసాయి. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు చెం దిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.

ముగిసిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలు

నస్పూర్‌, ఏప్రిల్‌ 26: పట్టణంలోని ప్రైవేట్‌ పాఠ శాలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ పురు షుల, మహిళల ప్రీమియర్‌ లీగ్‌ పోటీలు శుక్రవారం ముగిసాయి. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు చెం దిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఫస్ట్‌ తెలంగాణ హ్యాండ్‌ బాల్‌ ప్రీమి యర్‌ లీగ్‌ ఛాంపియన్స్‌ పురుషుల విభాగంలో వరం గల్‌, మహిళ విభాగంలో కరీంనగర్‌ జట్టు ఛాంపి యన్స్‌గా నిలిచాయి. పోటీల్లో పురుషుల జట్లలో వరం గల్‌ (ప్రథమ), హైదరాబాద్‌ (ద్వితీయ), ఆదిలాబాద్‌ (తృతీయ), మహిళల జట్లలో కరీంనగర్‌ (ప్రథమ), హైదరాబాద్‌ (ద్వితీయ), మహబూబ్‌నగర్‌ (తృతీయ) బహుమతులను కైవసం చేసుకున్నాయి. విజేత జట్లకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, సాధన గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ చైర్మన్‌ పెంచాల శ్రీధర్‌, న్యాయవాది దామో దర్‌ లాల్‌బంగ్‌, గూడెం ఆలయ డైరెక్టర్‌ భూపతి మధుకర్‌, సాధన గ్రూప్స్‌ సలహాదారుడు పెంచాల వేణులు విజేతలకు బహుమతులు అందజే శారు. టీం ఇండియా హ్యండ్‌ బాల్‌ కోచ్‌ బొడ్డు విష్ణువర్థన్‌, కరీంనగర్‌ జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి తుండ్ల శ్రీనివాస్‌, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సాంబ మూర్తి, మారయ్య, పాఠశాల ప్రిన్సిపాల్‌ పెంచాల సంధ్యా, పీఈటీలు పున్నం శ్రీనివాస్‌, ప్రేమ్‌ సాయి, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 10:07 PM