Share News

ప్రాణహిత మీదుగా మద్యం అక్రమ రవాణా

ABN , Publish Date - Apr 29 , 2024 | 10:26 PM

పార్లమెంటు ఎన్నికల నేపథ్యం లో మద్యం అక్రమ రవాణా ఊపందుకుంది. మంచిర్యాల నుంచి తెలం గాణ సరిహద్దులు దాటి మహారాష్ట్రకు పెద్ద మొత్తంలో మద్యం తరలిపో తోంది. మహారాష్ట్రలో మద్య నిషేధం అమలులో ఉండటంతో వ్యాపారులు కొందరు ఇక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా పక్క రాష్ట్రానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రాణహిత మీదుగా మద్యం అక్రమ రవాణా

మంచిర్యాల, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ఎన్నికల నేపథ్యం లో మద్యం అక్రమ రవాణా ఊపందుకుంది. మంచిర్యాల నుంచి తెలం గాణ సరిహద్దులు దాటి మహారాష్ట్రకు పెద్ద మొత్తంలో మద్యం తరలిపో తోంది. మహారాష్ట్రలో మద్య నిషేధం అమలులో ఉండటంతో వ్యాపారులు కొందరు ఇక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా పక్క రాష్ట్రానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కోటపల్లి మండలంలోని ప్రాణహిత పరివాహక ప్రాంతాల నుంచి మద్యం అక్రమంగా రాష్ట్ర ఎల్లలు దాటుతోంది.

ప్రాణహిత మీదుగా అక్రమ వ్యాపారం

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులను కలుపుతూ ప్రాణహిత నది ప్రవహిస్తోంది. సిండికేటుగా మారిన ఇక్కడి వ్యాపారులు ప్రాణహిత మీదుగా మద్యం తరలిస్తూ పెద్ద మొత్తంలో విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రాణహిత సరిహద్దు ప్రాంతమైన కోటపల్లి మండలంలోని ఆలుగామా, జనగామా, వెంచపల్లి, రాపన్‌పల్లి, తదితర ప్రాంతాలు ప్రాణహిత నది అవతల మహారాష్ట్రను ఆనుకొని ఉండటంతో మద్యం దందా జోరుగా సాగుతోంది. చెన్నూరు ఎక్సైజ్‌ డివిజన్‌ పరిధిలోని వైన్‌ షాపుల నుంచి అక్రమ మార్గంలో మద్యం మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం. వర్షాకాలంలో సైతం నాటు పడవల్లో మద్యాన్ని నది దాటిస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. పార్లమెంటు ఎన్నికల సమయంలో మహారాష్ట్రలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు అక్కడి నాయకులు తెలంగాణపై ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది.

పెద్ద మొత్తంలో మద్యం స్వాఽధీనం

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న మద్యం ఇటీవల పెద్ద మొత్తంలో పోలీసులకు పట్టుబడింది. నిత్యం పెద్ద మొత్తంలో మద్యం అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారన్న సమాచారంతో రామగుండం కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా పెంచారు. కోటపల్లి మండలం అన్నారం గ్రామానికి చెందిన టాటా ఏస్‌ ట్రాలీ డ్రైవర్‌ ఒకరు పెద్ద మొత్తంలో మద్యం తరలి స్తున్నాడనే పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌, ఎక్సైజ్‌శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 27న బీమారం నుంచి రూ.2 లక్షల విలువగల వివిధ బ్రాండ్లకు చెందిన 25 మద్యం కాటన్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాహనంతోపాటు డ్రెవర్‌ మహ్మద్‌షరీఫ్‌, మరో వ్యక్తి తిప్పా రమణయ్యను అదుపులోకి తీసుకు న్నారు. అలాగే 10 రోజుల క్రితం కోటపల్లి పోలీసులు సైతం మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. ఈ దాడుల సంద ర్భంగా పోలీసులు రూ.70వేల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకు న్నారు. ఓ వైపు పోలీసు దాడులు జరుగుతున్నా, వారి కళ్లుగప్పి పెద్ద ఎత్తున మద్యాన్ని అక్రమార్కులు ప్రాణహిత నది దాటిస్తున్నట్లు తెలుస్తోంది.

నిఘా ముమ్మరం చేశాం...రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌

జిల్లా నుంచి పెద్ద మొత్తంలో మద్యం మహారాష్ట్రకు తరలి వెళ్తుం డటంపై టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో నిఘా ముమ్మరం చేశాం. మద్యం అక్రమ రవాణా అవుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం దాడులు జరుపుతున్నాం. రెండు నెలల వ్యవధిలో జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో మద్యం పట్టుబడగా, పలు కేసులు నమోదు చేశాం. మద్యం అక్రమ రవాణా చేయడం చట్ట విరుద్ధం. పోలీసు బృందాలను అప్రమత్తం చేయడం ద్వారా అక్రమార్కులపై కఠిన చర్యలు చేపడతాం.

Updated Date - Apr 29 , 2024 | 10:26 PM