Share News

భవిష్యత్తుపై ఆశతో జీవించాలి

ABN , Publish Date - Apr 29 , 2024 | 10:23 PM

విద్యార్థులు పాస్‌, ఫెయిల్‌తో సంబంధం లేకుం డా భవిష్యత్తుపై ఆశతో జీవించాలని ఎస్‌ఐ సంతోష్‌ అన్నారు. స్థానిక ఉజ్వల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.

భవిష్యత్తుపై ఆశతో జీవించాలి

శ్రీరాంపూర్‌, ఏప్రిల్‌ 29: విద్యార్థులు పాస్‌, ఫెయిల్‌తో సంబంధం లేకుం డా భవిష్యత్తుపై ఆశతో జీవించాలని ఎస్‌ఐ సంతోష్‌ అన్నారు. స్థానిక ఉజ్వల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. చదువు ముఖ్యమైందని, జీవితం అంతకంటే ముఖ్యమైందనే విషయం గుర్తించాల న్నారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయిన వారు ఎంతో మంది తరువాత ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ఉన్నత స్థానాలను అధిరోహించారని గుర్తు చేశారు. చిన్న విషయానికే జీవితాన్ని ముగించుకోవద్దని, తల్లిదండ్రులకు శోఖాన్ని మిగల్చ వద్దని హితవు పలికారు. ఏవైనా సమస్యలుంటే తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు, పెద్దలు, సీనియర్లను సంప్రదించి పరిష్కరించుకోవాలని, అవసర మైతే నేరుగా పోలీసులను కలువవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 10:23 PM