Share News

విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేలా కృషి

ABN , Publish Date - May 08 , 2024 | 10:48 PM

విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేలా జిల్లా సైన్స్‌ కేంద్రం కృషి చేస్తోందని ఆర్డీవో వడాల రాములు అన్నారు. బుధవారం జిల్లా సైన్స్‌ కేంద్రంలో విద్యార్థులకు నిర్వహించిన సైన్స్‌ సమ్మర్‌ క్యాంపు ముగింపు కార్యక్రమంలో అతిథిగా పాల్గొని మాట్లా డారు.

విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేలా కృషి

ఏసీసీ, మే 8: విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేలా జిల్లా సైన్స్‌ కేంద్రం కృషి చేస్తోందని ఆర్డీవో వడాల రాములు అన్నారు. బుధవారం జిల్లా సైన్స్‌ కేంద్రంలో విద్యార్థులకు నిర్వహించిన సైన్స్‌ సమ్మర్‌ క్యాంపు ముగింపు కార్యక్రమంలో అతిథిగా పాల్గొని మాట్లా డారు. 12 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ శిబి రంలో విజ్ఞానాన్ని ప్రయోగాత్మక నైపుణ్యాన్ని పెం పొందిస్తూ అనేక అంశాలను నేర్పిస్తుందన్నారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరి శీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు. ఆటో మేటిక్‌ వాటర్‌ ఇన్‌ సిస్టం ఫర్‌ అగ్రికల్చర్‌ పరిక రం ద్వారా వ్యవసాయదారులు ఇంటి వద్దనే ఉం టూ పొలంలో పంటకు సరిపడ నీటిని సరఫరా చేసే విధా నాన్ని కొనియాడారు. డీఈవో యాద య్య మాట్లాడుతూ విద్యార్థులు రూపొందించిన బ్యాంకింగ్‌ సెక్యూరిటీ సిస్టం, కొండలు, గుట్టలు మూల మలుపుల వద్ద వాహనాలను ముందు గానే పసిగట్టేలా చేసిన పరికరం, కోతులు, పందులు పంట పొలా లను నాశనం చేయకుండా పరికరాలు సమాజానికి ఉపయోగపడేలా ఉన్నాయన్నారు. జిల్లా సైన్స్‌ అధికారి మధు బాబు, సెక్టోరల్‌ అధికారి చౌదరి, డీటీ శ్రీహరి, రాజేశ్వర్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 10:48 PM