Share News

ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రారంభం

ABN , Publish Date - Apr 26 , 2024 | 10:05 PM

మండలంలోని ముల్కల్లలో శుక్ర వారం ఓటరు స్లిప్పులను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాము లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మే 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో అర్హులైన వారందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రారంభం

హాజీపూర్‌, ఏప్రిల్‌ 26: మండలంలోని ముల్కల్లలో శుక్ర వారం ఓటరు స్లిప్పులను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాము లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మే 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో అర్హులైన వారందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓట్లు వేయాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌ హరిత, పంచాయతీ కార్యదర్శి సరిత, ఎన్నికల అధికారి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

జైపూర్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెన్నూరు రిటర్నింగ్‌ అధికారి దారావత్‌ చంద్రకళ పేర్కొన్నారు. శుక్రవారం నర్వ గ్రామంలోని ప్రజలకు ఓట రు స్లిప్పులను తహసీల్దార్‌ వనజా రెడ్డితో కలిసి అందజేశారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజ లకు అవగాహన కల్పించారు. గ్రామం లోని పోలింగ్‌ కేంద్రా లను పరిశీలించి సౌకర్యాలను బీఎల్‌వో లను అడిగి తెలుసు కున్నారు. పోలింగ్‌ కేం ద్రాల్లో వృద్ధులకు, గర్భిణీలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, ర్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్‌ఐ తిరుపతి, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

తాండూర్‌: మండలంలోని 37 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 27,209 ఓటరు స్లిప్పుల పంపిణీని ప్రారంభించినట్లు డిప్యూటి తహసీల్దార్‌ ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం పలు గ్రామాల్లో ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ బీఎల్‌వోల ద్వారా ఓటరు స్లిప్పులను పంపిణీ చేయడం జరు గుతుందన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

దండేపల్లి: పార్లమెంట్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెం చడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్‌ వోలు ఇంటింటికి వెళ్లి పోల్‌ చిట్టీలను పంపిణీ చేయాలని తహసీల్దార్‌ సంధ్యరాణి, ఎంపీడీవో ప్రసాద్‌లు సూచించారు. తహసీల్దార్‌ కార్యలయంలో ఓటర్‌ స్లిప్పుల పంపిణీపై బీఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు పోల్‌ చిట్టీలను అందజేయాల న్నారు. ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. ఓటు వేయడానికి వెళ్లే సమయంలో ఓటరు స్లిప్‌ను వెంట తీసుకె ళ్లాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌ విజయ, ఎంపీవో శ్రీనివాస్‌, సెక్టోయల్‌ ఆపీసర్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 10:05 PM