Share News

సామాన్యుల సమస్యలను పట్టించుకోని బీజేపీ

ABN , Publish Date - May 08 , 2024 | 10:46 PM

పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సామా న్యులను పట్టించుకోలేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండ రాం అన్నారు. బుధవారం బెల్లంపల్లిలో విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సామాన్యుల సమస్యలను పట్టించుకోని బీజేపీ

బెల్లంపల్లి, మే 8: పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సామా న్యులను పట్టించుకోలేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండ రాం అన్నారు. బుధవారం బెల్లంపల్లిలో విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని స్ధానాల్లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లతో అధికారం చేజిక్కించుకున్న ప్రధాని మోదీ, అమిత్‌ షాలు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తు న్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలపై అనేక పన్నుల భారం మోపిందని, కార్పొరేట్‌ సంస్థలకు 16 లక్షల కోట్ల పన్నులను మాఫీ చేసిందన్నారు. దేశంలో 75 శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో జీవిస్తున్నారని, రైతు లు రుణాలు మాఫీ చేయకుండా ఇబ్బం దులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజల మధ్య ఉన్న అసమానతలను తొలగించి ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ కృషి చేస్తుందన్నారు. దేశంలో 24 కోట్ల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడుతు న్నారని, 18 కోట్ల కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నాయన్నారు. తెలంగా ణలో 15 బిలియన్‌ టన్ను ల బొగ్గు నిక్షేపాలు గుర్తించామని, బీజేపీ తీసుకువచ్చిన నిబంధన ల వల్ల వేలంలో పాల్గొని పన్నులు చెల్లించి కొనే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. పెద్దపల్లి పార్ల మెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి వంశీ కృష్ణను గెలిపించా లని కోరారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకట స్వామి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 10:46 PM