Share News

రాజ్యాంగాన్ని మారుస్తుందని బీజేపీపై దుష్ప్రచారం

ABN , Publish Date - Apr 28 , 2024 | 10:10 PM

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాం గాన్ని మారుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నా రని ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగాల కుమార్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాలులో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాధ్‌, పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి శ్రీనివాస్‌ గొమాసేతో కలిసి పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని మారుస్తుందని బీజేపీపై దుష్ప్రచారం

ఏసీసీ, ఏప్రిల్‌ 28: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాం గాన్ని మారుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నా రని ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగాల కుమార్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాలులో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాధ్‌, పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి శ్రీనివాస్‌ గొమాసేతో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడు తూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీలకు ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాన మంత్రిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. కేంద్ర మంత్రి వర్గంలో 27 మం ది బీసీలకు స్ధానం కల్పించిన ఘనత మోదీకి దక్కు తుందన్నారు. విశ్వకర్మ యోజన పథకం ద్వారా రూ.3 లక్షల రుణం ఇచ్చి బీసీల అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రఘునాధ్‌ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఒకే కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ రెండు ఎమ్మెల్యే టికెట్లు, ఒక ఎంపీ టికెట్‌ కేటాయించడం దళితులను అవమానించడమేన న్నారు. పెద్దపల్లి పరిధిలో ఒక్క కుటుంబమే రాజ్య మేలుతుందని ఆ కుటుంబానికి గుణపాఠం చెప్పా లన్నారు. బీఆర్‌ఎస్‌ పట్ట ణ యూత్‌ అధ్యక్షుడు బింగి ప్రవీణ్‌, నస్పూర్‌ యూత్‌ అధ్యక్షుడు చల్ల విక్రమ్‌, పలువురు బీఆర్‌ ఎస్‌ నాయకులు బీజేపీలో చేరగా వారికి కండువా లు కప్పి ఆహ్వానించారు. సంజయ్‌, దుర్గం అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

దండేపల్లి: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చి న హామీలను కాంగ్రెస్‌ పార్టీ నెరవేర్చలేదని, ఇప్పు డు మరోసారి మోసపూరిత మాటాలతో ఓట్లు అడు గుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘ నాథ్‌ అన్నారు. ఆదివారం పెద్దపేట, లక్ష్మికాంత పూర్‌, బిక్కనగూడ గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి పెద్దపల్లి పార్లమెంట్‌ బీజేపీ ఎంపీ అభ్యర్ధి శ్రీనివాస్‌ గొమాసేను గెలిపించాలని ప్రచారం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ దేశాన్ని కాపాడుకునేందుకు బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. రాజయ్య, గురువయ్య, శ్రీనివాస్‌, రవిగౌడ్‌ కిషన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 10:10 PM