Share News

వరుణుడు కరుణిస్తాడా!

ABN , Publish Date - May 08 , 2024 | 04:02 AM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఫ్లేఆఫ్స్‌ రేసుకు అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌కు ముందు వరుణుడు ప్రతాపంతో ఉప్పల్‌ స్టేడియం...

వరుణుడు కరుణిస్తాడా!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఫ్లేఆఫ్స్‌ రేసుకు అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌కు ముందు వరుణుడు ప్రతాపంతో ఉప్పల్‌ స్టేడియం తడిసి ముద్దయింది. మరో నాలుగు రోజులు హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించడంతో బుధవారం లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎ్‌సజీ)తో జరగాల్సిన ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకవేళ మ్యాచ్‌ మొదలైనా పూర్తి స్థాయిలో జరుగుతుందా అనే అనుమానాలున్నాయి. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి లఖ్‌నవూ జట్టు ప్రాక్టీసు కూడా రద్దయింది. మ్యాచ్‌ జరిగితే మాత్రం ప్లేఆఫ్స్‌ బెర్త్‌ కోసం పోటీ పడుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌, లఖ్‌నవూ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇరు జట్లకు మరో మూడు మ్యాచ్‌లే మిగిలున్న నేపథ్యంలో ఇరువురికీ ఈ పోరు కీలకం కానుంది.

Updated Date - May 08 , 2024 | 04:02 AM