Share News

కెప్టెన్సీ వదిలేస్తాడా?

ABN , Publish Date - May 10 , 2024 | 01:50 AM

ఉప్పల్‌ మైదానంలో సన్‌రైజర్స్‌ ఓపెనర్ల బాదుడు.. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌సీజీ)కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ పదవికి ఎసరు తెచ్చేలా ఉంది. బుధవారం నాటి మ్యాచ్‌లో తమ జట్టు ఆడిన...

కెప్టెన్సీ వదిలేస్తాడా?

రాహుల్‌పై లఖ్‌నవూ ఫ్రాంచైజీ అసంతృప్తి

న్యూఢిల్లీ: ఉప్పల్‌ మైదానంలో సన్‌రైజర్స్‌ ఓపెనర్ల బాదుడు.. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌సీజీ)కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ పదవికి ఎసరు తెచ్చేలా ఉంది. బుధవారం నాటి మ్యాచ్‌లో తమ జట్టు ఆడిన తీరుపై ఎల్‌సీజీ యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఘోర ఓటమి చెందాక జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకా ఏకంగా మైదానంలోనే కెప్టెన్‌ రాహుల్‌తో సీరియస్‌గా మాట్లాడిన వీడియోలు దర్శనమిచ్చాయి. దీంతో ఆ జట్టు ఆడాల్సిన మరో రెండు మ్యాచ్‌లకు నాయకత్వ మార్పు ఉండవచ్చని సమాచారం. స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకొని బ్యాటింగ్‌పై దృష్టిసారించాలని రాహుల్‌ భావిస్తున్నాడట. ‘తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీతో ఆడేందుకు లఖ్‌నవూకు నాలుగు రోజుల సమయం ఉంది. ఇప్పటికైతే స్పష్టత లేదు కానీ రాహుల్‌ తన బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు కెప్టెన్సీ వదిలేసినా ఆశ్చర్యం లేదు. ఇందుకు మేనేజ్‌మెంట్‌ కూడా వ్యతిరేకించకపోవచ్చు’ అని ఐపీఎల్‌ వర్గాలు పేర్కొన్నాయి. తానాడిన 12 మ్యాచ్‌ల్లో 460 పరుగులు చేసినా.. రాహుల్‌ స్ట్రయిక్‌రేట్‌ 136.09 ఉండడం సమస్యగా మారింది. రూ.17 కోట్ల భారీ ధరతో రాహుల్‌ను లఖ్‌నవూ జట్టు రిటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే.

Updated Date - May 10 , 2024 | 01:50 AM