Share News

రుతురాజ్‌ షో

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:05 AM

రెండు వరుస ఓటములతో డీలా పడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుతంగా పుంజుకుంది. చెపాక్‌లో ఆల్‌రౌండ్‌ షోతో ఆధిపత్యం చూపుతూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 78 పరుగుల భారీ తేడా తో ఘనవిజయం సాధించింది...

రుతురాజ్‌  షో

నేటి మ్యాచ్‌

కోల్‌కతా X ఢిల్లీ రాత్రి7.30 గం. వేదిక: కోల్‌కతా

  • త్రుటిలో శతకం మిస్‌

  • చెన్నై ఘనవిజయం

పేసర్‌ తుషార్‌కు నాలుగు వికెట్లు

సన్‌రైజర్స్‌కు మరో ఓటమి

చెన్నై: రెండు వరుస ఓటములతో డీలా పడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుతంగా పుంజుకుంది. చెపాక్‌లో ఆల్‌రౌండ్‌ షోతో ఆధిపత్యం చూపుతూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 78 పరుగుల భారీ తేడా తో ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ రుతురాజ్‌ (54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 98) త్రుటిలో శతకం కోల్పోగా.. బౌలింగ్‌లో పేసర్‌ తుషార్‌ దేశ్‌పాండే (4/27) రైజర్స్‌ వెన్నువిరిచాడు. అటు ఎస్‌ఆర్‌హెచ్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచి, పట్టికలో నాలుగో స్థానానికి పడిపోగా.. సీఎ్‌సకే మూడో స్థానానికి చేరింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసింది. డారిల్‌ మిచెల్‌ (32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 52), శివమ్‌ దూబే (20 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 39 నాటౌట్‌) రాణించారు. ఉనాద్కట్‌, భువనేశ్వర్‌, నటరాజన్‌లకు ఒక్కో వికెట్‌ లభించింది. ఆ తర్వాత ఛేదనలో సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. మార్‌క్రమ్‌ (32), క్లాసెన్‌ (20) మాత్రమే ఆకట్టుకున్నారు. పతిరన, ముస్తాఫిజుర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రుతురాజ్‌ నిలిచాడు.


బౌలర్ల హవా: ఫోర్‌తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన రైజర్స్‌ జట్టు పేసర్‌ తుషార్‌ ధాటికి పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఏ దశలోనూ పోటీలోకి రాలేకపోయింది. మిడిలార్డర్‌లో మార్‌క్రమ్‌ కాస్త పోరాడినా.. 17 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ హెడ్‌ (13), అన్మోల్‌ ప్రీత్‌ (0) వికెట్లతో పేసర్‌ తుషార్‌ షాకిచ్చాడు. అలాగే మరో ఓపెనర్‌ అభిషేక్‌ (15)ను సైతం తన తర్వాతి ఓవర్‌లోనే అవుట్‌ చేయడంతో జట్టు పవర్‌ప్లేలో 53/3 స్కోరుతో నిలిచింది. అనంతరం సీఎ్‌సకే బౌలర్లు పరుగులను పూర్తిగా నియంత్రించారు. దీంతో 7-11 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా రాలేదు. స్పిన్నర్‌ జడేజా తొమ్మిదో ఓవర్‌లో నితీశ్‌ (15) వికెట్‌ తీయగా, ఓపిగ్గా ఆడుతున్న మార్‌క్రమ్‌ను పేసర్‌ పతిరన యార్కర్‌తో బౌల్డ్‌ చేయడంతో రైజర్స్‌ కష్టాలు ఆరంభమయ్యాయి. ఈ దశలో క్లాసెన్‌, సమద్‌ (19) ఆదుకునే ప్రయత్నం చేసినా.. భారీ షాట్లు ఆడలేకపోవడంతో రన్‌రేట్‌ పెరిగిపోయింది. దీంతో ఒత్తిడికి లోనైన క్లాసెన్‌ 16వ ఓవర్‌లో సిక్సర్‌కు ప్రయత్నించి పతిరనకు చిక్కాడు. అక్కడి నుంచి వరుస ఓవర్లలో సమద్‌, కమిన్స్‌ (5), షాబాజ్‌ (7), ఉనాద్కట్‌ (1)ల వికెట్లు టపటపా కోల్పోవడంతో 18.5 ఓవర్లలోనే రైజర్స్‌ ఆట ముగిసింది.


రుతురాజ్‌-మిచెల్‌ అండగా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రుతురాజ్‌, డారిల్‌ మిచెల్‌ కీలక ఇన్నింగ్స్‌తో మెరిశారు. చివర్లో శివమ్‌ దూబే మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే రైజర్స్‌ బౌలర్లు చివరి రెండు ఓవర్లలో 20 పరుగులే ఇవ్వడంతో చెన్నై స్కోరు 220లోపే ముగిసింది. ఓపెనర్‌ రహానె (9)ను మూడో ఓవర్‌లోనే భువనేశ్వర్‌ అవుట్‌ చేశాడు. కానీ మధ్య ఓవర్లలో రుతురాజ్‌కు అండగా డారిల్‌ మిచెల్‌ నిలిచాడు. ఈ సీజన్‌లో ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న మిచెల్‌ ఆరంభంలో నెమ్మదిగానే ఆడినా కుదురుకున్నాక బ్యాట్‌ ఝుళిపించాడు. తొలి 12 బంతుల్లో 11 రన్స్‌ చేసి నా.. మొత్తంగా 29 బంతుల్లోనే ఐపీఎల్‌లో తొలి ఫిఫ్టీని పూర్తి చేశాడు. 27 బంతుల్లో సిక్సర్‌తో రుతురాజ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత వరుస ఫోర్లతో చెలరేగిన మిచెల్‌ను 14వ ఓవర్‌లో ఉనాద్కట్‌ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో రెండో వికెట్‌కు 107 పరుగుల శతక భాగస్వామ్యం ముగిసింది. ఇక ఆ తర్వాత దూబే రాకతో చెన్నై రన్‌రేట్‌ ఎక్కడా తగ్గలేదు. 17వ ఓవర్‌లో అతడి రెండు సిక్సర్లతో 17 రన్స్‌ వచ్చాయి. తర్వాతి ఓవర్‌లోనూ అతడు 6,4తో మెరిశాడు. కానీ 19వ ఓవర్‌లో ఉనాద్కట్‌ కేవలం 8 పరుగులతో కట్టడి చేశాడు. అలాగే చివరి ఓవర్‌లో రుతురాజ్‌ సెంచరీ కోల్పోయినా.. ధోనీ (5 నాటౌట్‌) ఫోర్‌, దూబే సిక్సర్‌తో 12 పరుగులే వచ్చాయి.


స్కోరుబోర్డు

చెన్నై: రహానె (సి) షాబాజ్‌ (బి) భువనేశ్వర్‌ 9, రుతురాజ్‌ (సి) నితీశ్‌ (బి) నటరాజన్‌ 98, మిచెల్‌ (సి) నితీశ్‌ (బి) ఉనాద్కట్‌ 52, దూబే (నాటౌట్‌) 39, ధోనీ (నాటౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు : 9 ; మొత్తం (20 ఓవర్లలో) 212/3 ; వికెట్లపతనం : 1-19, 2-126, 3-200 ; బౌలింగ్‌ : భువనేశ్వర్‌ 4-0-38-1, నితీశ్‌ కుమార్‌ 1-0-8-0, షాబాజ్‌ అహ్మద్‌ 3-0-33-0, నటరాజన్‌ 4-0-43-1, ఉనాద్కట్‌ 4-0-38-1, కమిన్స్‌ 4-0-49-0.

సన్‌రైజర్స్‌ : హెడ్‌ (సి) మిచెల్‌ (బి) తుషార్‌ 13, అభిషేక్‌ (సి) మిచెల్‌ (బి) తుషార్‌ 15, అన్‌మోల్‌ప్రీత్‌ (సి) మొయిన్‌ (బి) తుషార్‌ 0, మార్‌క్రమ్‌ (బి) పతిరన 32, నితీశ్‌ (సి) ధోనీ (బి) జడేజా 15, క్లాసెన్‌ (సి) మిచెల్‌ (బి) పతిరన 20, సమద్‌ (సి) సబ్‌ సమీర్‌ (బి) శార్దూల్‌ 19, షాబాజ్‌ (సి) మిచెల్‌ (బి) ముస్తాఫిజుర్‌ 7, కమిన్స్‌ (సి) మిచెల్‌ (బి) తుషార్‌ 5, భువనేశ్వర్‌ (నాటౌట్‌) 4, ఉనాద్కట్‌ (సి) మొయిన్‌ (బి) ముస్తాఫిజుర్‌ 2, ఎక్స్‌ట్రాలు : 3 ; మొత్తం (18.5 ఓవర్లలో) 134 ఆలౌట్‌ ; వికెట్లపతనం : 1-21, 2-21, 3-40, 4-72, 5-85, 6-117, 7-119, 8-124, 9-132 ; బౌలింగ్‌ : దీపక్‌ చాహర్‌ 3-0-22-0, తుషార్‌ దేశ్‌పాండే 3-0-27-4, ముస్తాఫిజుర్‌ 2.5-0-19-2, జడేజా 4-0-22-1, శార్దూల్‌ 4-0-27-1, పతిరన 2-0-17-2.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 9 8 1 0 16 0.694

కోల్‌కతా 8 5 3 0 10 0.972

చెన్నై 9 5 4 0 10 0.810

హైదరాబాద్‌ 9 5 4 0 10 0.075

లఖ్‌నవూ 9 5 4 0 10 0.059

ఢిల్లీ 10 5 5 0 10 -0.276

గుజరాత్‌ 10 4 6 0 8 -1.113

పంజాబ్‌ 9 3 6 0 6 -0.187

ముంబై 9 3 6 0 6 -0.261

బెంగళూరు 10 3 7 0 6 -0.415

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌


ఐపీఎల్‌లో పరుగుల పరంగా హైదరాబాద్‌కు ఇదే అతిపెద్ద ఓటమి

ఈ లీగ్‌లో 150 మ్యాచ్‌లు గెలిచిన తొలి ప్లేయర్‌గా ఎంఎస్‌ ధోనీ

ఓ ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో ఎక్కువ క్యాచ్‌లు (5) పట్టిన ఫీల్డర్‌గా నబీతో సమంగా నిలిచిన మిచెల్‌

చెపాక్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిన హైదరాబాద్‌

1

టీ20ల్లో ఎక్కువ (35) 200+ స్కోరు సాధించిన జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌

2

ఒకే వేదికలో ఎక్కువ మ్యాచ్‌ (50)లు గెలిచిన రెండో జట్టుగా చెన్నై. వాంఖడేలో ముంబై 51 సార్లు గెలిచింది.

Updated Date - Apr 29 , 2024 | 06:05 AM