Share News

అన్నీ అనుకున్నట్టు జరగవుగా!

ABN , Publish Date - May 04 , 2024 | 05:27 AM

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ఐదు టైటిళ్లు అందించిన రోహిత్‌ శర్మ తాజా సీజన్‌లో హార్దిక్‌ నేతృత్వంలో ఆడుతున్నాడు. అయితే జట్టు కెప్టెన్సీ మార్పు...

అన్నీ అనుకున్నట్టు జరగవుగా!

ముంబై కెప్టెన్సీపై రోహిత్‌

ముంబై: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ఐదు టైటిళ్లు అందించిన రోహిత్‌ శర్మ తాజా సీజన్‌లో హార్దిక్‌ నేతృత్వంలో ఆడుతున్నాడు. అయితే జట్టు కెప్టెన్సీ మార్పు అభిమానులకు ఏమాత్రం రుచించని విషయం తెలిసిందే. అటు ఈ పరిణామంపై రోహిత్‌ తొలిసారి స్పందించాడు. ‘ఇదంతా జీవితంలో భాగంగా అనుకోవాలి. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. గతంలో కూడా నేను చాలామంది కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పేమీ లేదు’ అని రోహిత్‌ తేల్చాడు.

Updated Date - May 04 , 2024 | 05:27 AM